పది రూపాయల బిల్లుకి... తొంభై రూపాయల టిప్!
Publish Date:Nov 28, 2016
Advertisement
స్మృతీ ఇరానీ... మోదీ క్యాబినేట్ లో ఈమెకంటే పెద్ద కాంట్రవర్సియల్ మినిస్టర్ మరొకరు వుండరు! తన శాఖ ఏదైనా స్మృతి మీడియాలో మాత్రం వుంటారు. పాపం చాలా సార్లు అమె వద్దనుకున్నా వివాదాల్లో ఇరుక్కుంటూ వార్తల్లో కనిపిస్తూ, వినిపిస్తూనే వుంటారు. ఇప్పుడు మరోసారి అలానే జరిగింది. కాకపోతే, వివాదమేం కాదుగాని... కాస్త వెరైటీ కారణంతో వార్తల్లో, సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు!
స్మృతి ఇరానీ మోదీ వేసిన బాంబులా 2014 ఎన్నికల్లో పేలింది. ఆమె ఓడినా గెలిచినట్టే సంచలనం సృష్టించింది. అందుక్కారణం రాహుల్ గాంధీ నియోజకవర్గంలో అతడికి ముచ్చెమటలు పట్టించటమే. దాదాపూ గెలిచినంత పని చేసింది స్మృతీ. అప్పట్నుంచీ కాంగ్రెస్ ఆమెను సీరియస్ గా తీసుకుని టార్గెట్ చేసింది. మీడియా కూడా స్మృతీకి వున్న యాక్టింగ్ హిస్టరీ కారణంగా పదే పదే వార్తలు రాస్తూ వచ్చింది. ఆమె హైద్రాబాద్ , ఢిల్లీ యూనివర్సిటీల్లో విద్యార్థుల గొడవల్ని సరిగ్గా హ్యాండిల్ చేయటం లేదనటం దగ్గర నుంచీ ... ఆమె వ్యక్తిగతంగా జ్యోతిష్యుడి వద్దకి వెళ్లటం వరకూ అన్నీ వివాదాస్పదం అవుతూ వచ్చాయి. మోదీ క్యాబినేట్లో ఆమెలాగా దాడికి గురైన మరో మంత్రే లేరంటే ఆశ్చర్యం లేదు...
స్మృతీ ఇరానీ ఎప్పుడూ ఏదో ఒక విధంగా న్యూస్ లో వుండటానికి కారణం ఆమె అనూహ్యమైన ప్రవర్తనే! ఇరానీ ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఎలా బిహేవ్ చేస్తుందో ఎవ్వరికీ తెలియదు! పార్లమెంట్లో ఆమె భీభత్సమైన స్పీచ్ ఇస్తే మార్నాడు పేపర్లలో ఆమెని 'ఆంటీ నేషనల్' అన్నారు జర్నలిస్టులు. అలా అనటం తప్పా ఒప్పా పక్కన పెడితే ఆమెని మాత్రం ఇగ్నోర్ చేయలేని స్థితి పేపర్లు, ఛానల్స్ ది. తాజాగా స్మృతీ తమిళనాడుకి ఒక కార్యక్రమం కోసం వెళ్లింది. అయితే, ఆమె చెప్పులు అనుకోకుండా తెగిపోవటంతో రోడ్డున వున్న మోచీ వద్ద కాన్వాయ్ ఆపించిందట! తెగిన చెప్పు కుట్టించుకుని కుట్టిన వ్యక్తికి వంద నోటు ఇచ్చిందట! చిల్లర తీసుకోకుండా వుండనిమ్మని అక్కడ నుంచి బయలుదేరిందట! ఒక కేంద్ర మంత్రి ఇలా చెప్పులు కుట్టించుకోవటం... నిజంగా ఎవ్వరూ ఊహించలేని విషయమే కదా...
దేశమంతా నోట్ల కొరతతో టెన్షన్ లో వుండటం వల్ల స్మృతీ ఇరానీ చెప్పుల స్టోరీ పెద్దగా సెన్సేషన్ అవ్వటం లేదు కాని... మీడియాకి కాస్త ఖాళీ టైం ఎక్కువ వుండి వుంటే నానా రచ్చ అయ్యి వుండేదే! మంత్రిగారు రోడ్డు మీద చెప్పులు కుట్టించుకోవటం ఒట్టి డ్రామా అని స్మృతీ వ్యతిరేకులు ఏదేదో మాట్లాడేవారు. దానికి ఇరానీ తన ముక్కుసూటి సమాధానంతో మరింత ఘాటు యాడ్ చేసేది. ఇలా పేపర్లు, ఛానల్స్ లో కొన్ని రోజులు హడావిడి నడిచేది! మొత్తానికి స్మృతీ మరో అనవసర కాంట్రవర్సీ నుంచైతే బయటపడిపోయింది!
http://www.teluguone.com/news/content/ smriti-irani-45-69610.html





